KMM: అసంపూర్తిగా ఉన్న టాయిలెట్లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, క్రీడాస్థలానికి ట్రాక్ నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థులను బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు.