MBNR: కేంద్రం ప్రకటించిన జాతీయ జల అవార్డులలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు అవార్డు వరించింది.”జల్ సంజయ్ జన్ భాగిదారి” 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు 25 లక్షల నగదు బహుమతి లభించిందని కలెక్టర్ తెలిపారు.