WGL: BCలకు 42% రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ స్తంభింపజేయాలని BC JAC రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఇవాళ BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ నేతృత్వంలో JAC నాయకులు MP డా. కడియం కావ్యను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.