W.G: సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు కోరారు. పాలకొల్లు మహిళా భవన్లో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ అధ్యక్షతన మంగళవారం విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాసుదేవరావు మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.