W.G: బాలికలు జీవిత లక్ష్యంపై విద్యార్థి దశలోనే దృష్టి సాధించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కే.శ్రీదేవి సూచించారు. మంగళవారం మారంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల విద్య ప్రాముఖ్యత, కెరీర్ గైడెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలు చదువుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలను నమ్మవద్దని హితవు పలికారు.