GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామంలో మంగళవారం మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీవార్మ్) నియంత్రణపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమంలో ఏరువాక సెంటర్ కోఆర్డినేటర్ ఏ. మనోజ్, మండల వ్యవసాయ అధికారి వాసంతి హాజరయ్యారు. మనోజ్ కత్తెర పురుగు లక్షణాలను మొక్కజొన్న రైతులకు వివరించారు.