MDK: కొల్చారంలో పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కొల్చారం మోడల్ మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీపీఎం వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై బాల్య వివాహాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా 100 రోజుల ప్రచారంలో రీజన్ సంస్థ ఆర్గనైజర్ నవనీత అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు జరగకుండా ప్రతి ఒక్కరు చూడాలని పిలుపునిచ్చారు.