BDK: కేంద్రం ప్రవేశపెట్టిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మంగళవారం ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. జిల్లాలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణాలు, నీటి సంరక్షణ చర్యలకు ఈ అవార్డు దక్కింది. ఏడాదిలో మూడు అవార్డులు అందుకున్న కలెక్టర్కు జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు.