PLD: సత్తెనపల్లి పట్టణ రఘురామ్ నగర్ ప్రజావేదికలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.14,64,050 విలువైన సీఎంఅర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కన్నా అందజేశారు. ఇలాంటి సంక్షేమ పథకాలు నిజంగా అవసరమైన వారికి ఉపశమనాన్ని అందిస్తున్నాయని తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.