ADB: ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం హోసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ వంశీ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి రెండవ బిల్లు విడుదలకు సంబంధించిన వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నవీన్ కుమార్, పత్తు సింగ్ తదితరులు పాల్గొన్నారు.