TPT: పుత్తూరు మండలం ఎగువ గూడూరు చెరువును మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు, దళిత గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు నందయ్య ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. అందులో గ్రామంలోని రోడ్లు, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని కోరారు.