WGL: వర్ధన్నపేట పట్టణంలో సహకార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ జీ.సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ఉద్యానవనాధికారి శ్రీనివాసరావు సాగు విధానాలు, నీటి నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు.