W.G: పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో జరిగిన “మన డబ్బు – మన లెక్కలు” కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు ‘స్త్రీ నిధి’ కింద మంజూరైన రూ.1,35,00,000చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందన్నారు.