SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం రాత్రి కార్తీకమాసం పురస్కరించుకుని జ్వాలా తోరణం నిర్వహించారు. ఉదయం తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఛైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు ఆధ్వర్యంలో ఈ జ్వాలాతోరణ కార్యక్రమం చేపట్టారు.