BHPL: టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి, వెంకట్రావుపల్లి(బీ), పంగిడిపల్లి, టేకుమట్ల గ్రామాల్లో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు దళారుల నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.