ప్రకాశం: విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని కనిగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దొడ్డ వెంకట సురేష్, పట్టణ యువత అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పిలుపునిచ్చారు. కనిగిరిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జ్ నాగ పద్మజ, గయాజ్ భాష పాల్గొన్నారు.