PPM: ఈనెల 28న ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11గం.లకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.