NLG: అస్సాంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంపోడు మండలం పిట్టలగూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పసిమేకల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మల్లయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.