కోనసీమ: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా, ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 20,000 ఆర్థిక సహాయం ప్రకటించింది. అమలాపురంలో ఇవాళ జేసీ నిశాంతి మాట్లాడుతూ.. కోనసీమలో రెండవ విడతలో 1,34,439 మంది అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రైతు కుటుంబాలకు రూ. 90.59 కోట్ల ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని తెలిపారు.