CTR: జిల్లాలో వికలాంగుల కోసం గురువారం నుంచి ఈ నెల 26 వరకు 8 శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం చిత్తూరు బీసీ భవన్లో వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శిబిరాలలో ఉపకరణాలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.