HNK: బాలసముద్రంలోని విండ్రో కంపోస్టింగ్ యూనిట్‌ను మంగళవారం మున్సిపల్ కమిషనర్, కూడా వైస్ ఛైర్మన్ చాహత్ బాజ్‌పేయ్, మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఈ సందర్భంగా వారు హాస్టళ్లు, హోటల్స్, మార్కెట్ల నుంచి సేకరించిన తడి వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. ప్రక్రియ వేగవంతం కావాలని, నాణ్యత పెంచాలని సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు.