MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని సీఐటీయూని జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయుూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. లక్షెట్టిపేట మున్సిపాలిటిగా ఏర్పడక ముందు ప్రజలకు ఉపాధి హామీ పనులు ద్వారా పని ఉండేదన్నారు. వారికి మళ్లీ ఉపాధి పనులు కల్పించాలని ఆయన కోరారు.