TG: కేంద్రమంత్రి CR పాటిల్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మేం వ్యతిరేకించాం. దాంతో ప్రాజెక్టు పేరు మార్చి మళ్లీ అనుమతుల కోసం ఏపీ ప్రయత్నిస్తుంది. ఈ విషయంపై మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం. సుప్రీం స్టే ఉన్నా ఆల్మట్టి ఎత్తుపెంచేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు.