E.G: కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో జల్ సంచాయ్-జన్ భాగీదారీ విభాగంలో రాజమండ్రి నగరం జాతీయ స్థాయిలో నాల్గవ ర్యాంకును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ వేడుకలలో కేంద్ర మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ చేతులమీదుగా నగర కమిషనర్ రాహుల్ మీనా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.