WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపిన విషయం తెలిసిందే. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇవాళ వ్యవసాయ మంత్రి తుమ్మల, కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించగా.. వారు బంద్‌ను విరమించుకున్నారు. రేపటి నుంచి మళ్లీ యధావిధిగా పత్తి కొనుగోలు జరగనున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు.