ASR: కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహంలో వంటశాలను పరిశీలించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఉండడంతో వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్ల పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురవడంతో హెచ్ఎం, వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.