KRNL: అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత కింద రేపు రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేయనుందని జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఇవాళ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.