ADB: నషా ముక్త్ భారత్‌లో భాగంగా భారతదేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం మావల మండలంలోని రెసోనన్స్ స్కూల్లో జిల్లా ఎస్పీ విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భాగస్వామ్యం కావాలని ప్రతిజ్ఞ చేయించారు.