KMM: వైరా మండలం రెబ్బవరం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో ఇంగ్లీష్ బోధనా పద్ధతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.