E.G: దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై మంగళవారం కారును ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే స్పందించి, హైవే అంబులెన్స్ 108 సహాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.