CTR: వికలాంగులు, వృద్ధులకు అవసరమయ్యే సహాయ పరికరాల గుర్తింపుకు నియోజకవర్గ స్థాయి శిబిరం ఈనెల 23న సదుం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాధారాణి మంగళవారం తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలానికి సంబంధించిన వారు హాజరు కావచ్చన్నారు. శిబిరానికి వచ్చే వారు బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారై ఉండాలన్నారు.