KRNL: బిర్లా కాంపౌండ్ విజేత కోచింగ్ సెంటర్లో రాయలసీమ 97వ ఆత్మగౌరవ దినోత్సవం ఇవాళ జిల్లా ఉద్యమ యువ నాయకుడు సీమ కృష్ణ రాథోడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1928లో ఆంధ్ర మహాసభలో ‘దత్తమండలం’కు బదులుగా ‘రాయలసీమ’ పేరును ప్రతిపాదించడం చారిత్రాత్మక ఘట్టమని గుర్తుచేశారు. సీమ హక్కుల కోసం నీళ్లు-నిధులు-నియామకాలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు.