SKLM: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో ఇవాళ మత్స్య రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కే.భాగ్యలక్ష్మి తెలిపారు. చేపలు రొయ్యల పెంపకంలో వచ్చే వ్యాధులకు మితిమీరిన యాంటీబయోటిక్స్ వాడకంతో కలిగే అనర్ధాలను శాస్త్రవేత్తలు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో CIFT శాస్త్రవేత్త డా.అహ్మద్ భాష, బి. మధుసూదన్ రావు, సిహెచ్ బాలకృష్ణ, రైతులు పాల్గొన్నారు.