నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు ఇవాళ సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలో గల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు AFDO శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.