ATP: వీరశైవ లింగాయత కార్పొరేషన్ ఛైర్మన్ తుల్జాపూర్ స్వప్న ఆధ్వర్యంలో అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాల్లో వీరశైవ లింగాయతుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. శ్రీ గవిమఠం సంస్థానం ఉత్తరాధికారి శ్రీ కరి బసవ రాజేంద్ర మహాస్వామి ఆశీర్వచన ప్రసంగం చేశారు.