TG: మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. ‘ఫేక్ ఎన్కౌంటర్స్ చేయడం విచారకరం. కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననం తప్ప మరొకటి కాదు. ఆంధ్ర, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారు’ అని ఆరోపించారు.