TG: మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ.40వేలు లంచం తీసుకుంటుండగా.. ACB అధికారులు వచ్చారు. వారిని చూసిన SI పొలాల్లోకి పరుగెత్తాడు. దీంతో అధికారులు.. అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఎస్సై.. ACB అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.