CTR: ఇంటి పట్టాల పంపిణీకి అర్హులైన పేద లబ్ధిదారుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని పలమనేరు MLA అమరనాథ రెడ్డి సూచించారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో మంగళవారం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో మంజూరైన అభివృద్ధి పనులకు సంబందించి టౌన్ హాల్, డ్రైనేజీ, చెరువు అభివృద్ధి పనులపై చర్చించారు.