AP: మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఏలూరు గ్రీన్సిటీలో తనిఖీలు చేపట్టి.. 12 మంది మావోయిస్ట్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. ఓ అపార్ట్మెంట్లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.