KDP: జాతీయ గ్రంథాలయ 58వ వారోత్సవాలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. అయితే స్థానిక గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖన, కబడ్డీ, పరుగు పందెం, వాలీబాల్ తదితర ఆటల పోటీలను నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారిణి స్వరూప రాణి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు.