NGKL: పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కల్వకుర్తిలోని కాటన్ మిల్లు వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి మంగళవారం ఆయన పత్తి కొనుగోళ్లపై నిరసన తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ ప్రస్తుతం 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.