TPT: శ్రీకాళహస్తి ఈదులగుంటలోని మగ్గం బాబా అలీషా దర్గాలో మంగళవారం గంధోత్సవం ఘనంగా జరిగింది. కులమతాలకు అతీతంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రార్థనలు చేశారు. దర్గా కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఇందులో టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ, షఫీ, దొరబాబు, జహీర్ అహ్మద్ పాల్గొన్నారు.