SKLM: సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మత్స్యకారుడు మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం పోలాకి మండలంలో చోటుచేసుకుంది. గుప్పిడిపేటకు ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో తెప్ప బోల్తా పడి సముద్రంలో మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.