MBNR: కల్వకుర్తి నుంచి జడ్చర్ల వైపు వస్తున్న ఓ కారు గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోళ్ల దాణా కంపెనీ వద్ద బైక్ అకస్మాత్తుగా అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.