ఏటీపీ ఫైనల్స్ టెన్నీస్ టోర్నమెంట్లో ఇటలీ స్టార్ యానిక్ సినర్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన అల్కరాస్‌పై అతడు విజయం సాధించాడు. రెండో సెట్లో తొలి గేమ్‌లోనే సర్వీస్ కోల్పోయినా సినర్ పుంజుకున్నాడు. పన్నెండో గేమ్‌లో అల్కరాస్ సర్వీస్ బ్రేక్ చేసి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.