ATP: శింగనమల ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ దత్తత, బాల్య వివాహాల నివారణ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, వాటిని అరికట్టాలని పిలుపునిచ్చారు. బాలల రక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు.