SRD: ఈనెల 20న నారాయణఖేడ్ పట్టణంలోని కన్వెన్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి పంపిణీ చేస్తారని క్యాంప్ కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణఖేడ్, మనూర్, కంగ్టి, నాగల్ గిద్ద, నిజాంపేట్, సిర్గాపూర్ మండలాలకు సంబంధించిన లబ్ధిదారులు గురువారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు.