ADB: కోలాం ఆదివాసీలకు అండగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇవాళ ఉట్నూర్ మండలం చెరువుగూడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 53 ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం భూమి పూజ చేశారు.