GDWL: యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన మాదకద్రవ్యాల అనర్థాలను వివరించి, ప్రతిజ్ఞ చేయించారు.