AP: 28 మంది మావోయిస్టులు కానూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని ఎస్పీ విద్యాసాగర్ ప్రకటించారు. ‘కచ్చితమైన సమాచారంతో సోదాలు చేశాం. ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బృందాలు సంయుక్త ఆపరేషన్స్ చేశాయి. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయారు. భవనంలో ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. పట్టుబడ్డవారిలో 21 మంది మహిళలు ఉన్నారు’ అని తెలిపారు.